పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సత్య సాయి ట్రస్ట్ సభ్యుడు ఆర్జె రత్నాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని గణేషుడికి హారతులు ఇచ్చి పూజలు చేశారు. ప్రశాంతి నిలయంలో ఉంటున్న భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరై గణేశుడిని దర్శించుకున్నారు.