కొత్తగూడెం రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టోర్‌లో నిల్వ ఉంచిన ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆసుపత్రులకు సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.