ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో వైసీపీ కార్యకర్త గాలి చిన్న బ్రహ్మయ్య దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా కత్తితో దాడి చేసి తర్వాత ఒంటిపై పెట్రోల్ యాసిడ్ పోసి తగలబెట్టారు. తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడి వేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వైసిపి కార్యకర్త హత్యకు గురైన విషయం తెలుసుకున్న గిద్దలూరు వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.