పోలీస్ అధికారులకు అప్పగించిన పనులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన రమేష్ మరియు కుమారస్వామి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వారికి భుజాలపై నక్షత్ర చిహ్నాలు అలంకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేసే ప్రజల అభిమానాన్ని పొందాలని సిపి వారికి తెలిపారు.