రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బీ.కాంతారావు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం పాడేరు మండలంలో పర్యటించారు. ముందుగా ఆయన ఎంకే వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేవని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఛైల్డ్ డెవలప్మెంట్ పీడీని ఆదేశించారు. అనంతరం పాడేరులో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేశారు. రిజిస్టర్ లో తప్పులు గుర్తించి, హెచ్ఎంకు మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.