కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన దేవాదుల కోసం పనులు చేయలేదని నిరసనగా , రేవంత్ రెడ్డికి, కడియం శ్రీహరి కి,కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. రైతులకు రెండు పంటలకు నీళ్లు అందివ్వాలని ' రైతన్న కోసం రాజయ్య యాత్ర' అంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో వెంకటాపూర్ నుండి మల్లక్ పల్లి , ధర్మపురం గ్రామాల వరకు పాదయాత్ర చేపట్టారు. మల్లక్ పల్లి, ధర్మపురం గ్రామాల మధ్య పిండాలు పెట్టి రాజయ్య నిరసన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.