ఓటర్ లిస్టు, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8వ తేదీలోగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో శ్రీకాంత్ తెలిపారు. శనివారం తలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్, పోలింగ్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేశారు. 8వ తేదీ ఉ. 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు