కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వాట్సాప్ గవర్నెన్స్'పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మూడో మండల అధ్యక్షురాలు గాయత్రి బెహరా అన్నారు. శనివారం బ్రాడీపేటలో ఆమె మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ డిజిటల్ విధానం ద్వారా ఏ అపరిష్కృత సమస్య అయినా త్వరగా పరిష్కారమవుతుందని ఆమె పేర్కొన్నారు.