90శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న రాజ్ మా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ రైతులకు సూచించారు. శనివారం సాయంత్రం కొయ్యూరు మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి బీ.రాజ్ కుమార్ తో కలిసి పలువురు గిరిజన రైతులకు రాజ్ మా విత్తనాలు పంపిణీ చేశారు. గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, సాంప్రదాయ పంటలు పండించి ఆర్ధికాభివృద్ది సాధించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.