కమ్మర్పల్లి మండలం హసా కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మించుకున్న లబ్ధిదారుల ఖాతాలో ఐదుగురికి లక్ష చొప్పున, మరొకరికి మూడు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిటి లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, మోదిని శ్రీధర్, మంద భాగ్య, లలిత, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.