గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ముందస్తుగానే మండపలకు భారీ గణేష్ ప్రతిమలు తరలివెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మేడిపల్లి మండలాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ చందుర్తి,రుద్రంగి,వేములవాడ టౌన్,రూరల్ మండలాల వ్యాప్తంగా మండప నిర్వహకులు భారీ గణనాథులను విక్రయించారు. ఆదివారం అయితే వేములవాడ, జగిత్యాల,కోరుట్ల రహదారి వెంట భారీ గణనాధులు దర్శనమిస్తున్నాయి. భారీ గణనాథులను తరలిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.