బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో విధి నిర్వహణలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన పెసర్లంక సచివాలయం జూనియర్ లైన్మెన్ గుంటూరు సురేష్ మృతదేహానికి ఆయన స్వగ్రామం కోళ్లపాలెంలో విద్యుత్ శాఖ అధికారులు బుధవారం నివాళులర్పించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, మృతి ఖర్చుల నిమిత్తం 25 వేలు అందజేశామని, అలాగే సురేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.