నేన్నల్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా అక్రమంగా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు అయన తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన వెంకన్న,శ్రీనివాస్, స్వప్న లు అక్రమంగా గుడుంబా తయారు చేసి నేన్నల్ చుట్టుపక్కల గ్రామాలకు గుడుంబా విక్రయిస్తున్నారని తెలిపారు ఈ క్రమంలో గుడుంబా విక్రయించేందుకు వెళ్తుండగా వారిని పట్టుకొని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు