రాష్ట్రంలోని రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అందులో భాగంగా ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలింపుకు నిరసనగా ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట 9న అన్నదాత పోరు కార్యక్రమం ఉంటుందని నియోజకవర్గంలోని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.