చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని ఎంఎం .పెట్రోల్ బంక్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొని ద్విచక్ర వాహనంలో వెళ్తున్న చౌడేపల్లి మండలం బూటకపల్లి గ్రామానికి చెందిన లాల్ జాన్ బాషా 30 సంవత్సరాలు గాయపడ్డాడు వెంటనే స్థానికులు గాయపడ్డ లాల్ జాన్ భాషా ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. వైద్యులు సలహా మేరకు లాల్ జాన్ భాషా ను మెరుగైన వైద్యం కోసం సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలోపెద్ద ఆసుపత్రికి తరలించారు.