పల్నాడు జిల్లా,నకరికల్లు శివారులో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను మంగళవారం అర్ధరాత్రి సమయంలో అధికారులు పట్టుకున్నారు.నకరికల్లు మండలం కుంకలగుంట నుండి తెలంగాణ లోని త్రిపురారం మండలం బొర్రాయపాలెం కు తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకోవడం జరిగింది.ఈ ఘటనలో సుమారు రూ.5,500 విలువ చేసే 20, బస్తాల యూరియాను అదేవిధంగా ఒక ఆటో, తెలంగాణ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి నకరికల్లు పోలీసులకు అప్పగించినట్లు అగ్రికల్చర్ ఏడి కృష్ణ దేవరాయలు తెలిపారు.