ఏలూరు జిల్లా నూజివీడు, ఏలూరు లో బషీరాబాగ్ అమరవీరులకు నివాళి అర్పించిన సిపిఎం పార్టీ నాయకులు ఆగస్టు 28 తేదీ2000 సంవత్సరంలో బషీరాబాగ్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధనరెడ్డిలకు, నూజివీడులో చిన్న గాంధీ సెంటర్ వద్ద ఏలూరులోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఐ వామపక్షాల పార్టీ నాయకులు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విద్యుత్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో బషీర్ బాగ్ ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.