వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్న పాడి పరిశ్రమను అన్ని విధాలా ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయ, కూలీల సంఘం నాయకులు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఏఐకెకెఎంఎస్ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వి.రంగనాయకులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం.గిరీష్ మాట్లాడుతూ, జిలాల్లో వేలాదిమంది రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాడి పరిశ్రమ వైపు