ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియాకు గణేష్ ఉత్సవాలపై కీలక సూచనలు చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీడియాతో మాట్లాడిన డిఎస్పి గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు Ganeshutsav.net వెబ్ సైట్ ద్వారా అనుమతులు పొందాలన్నారు. ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు ముందుగానే జాబితాను ప్రకటించాలని ఎలక్ట్రిసిటీ, మైక్ సెట్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డీజే ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవని అల్లరిని సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రజలను హెచ్చరించారు.