గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,54,685 గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హుస్సేన్సాగర్లో మాత్రమే శనివారం సుమారు 10 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, నగరవ్యాప్తంగా 20 నుంచి 30 వేల మధ్య విగ్రహాలు గంగ ఒడికి చేరాయి. అన్ని నిమజ్జన పాయింట్లలో సాఫీగా, సురక్షితంగా కార్యక్రమం జరిగేలా జీహెచ్ఎంసీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తోందని