జమ్మికుంట: పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం కోసం బాక్సులు పెట్టుకొని పాటలతో ఊరేగింపు చేస్తూ వెళుతుండగా శాలవాడకు చెందిన శ్యామ్ సందీప్ రాకేష్ హేమంత్ అనే నలుగురు వ్యక్తులు తమ వినాయకుని వద్దకు వచ్చి డాన్స్ చేస్తూ అక్కడ నుండి వినాయకుని ముందుకు కదలనివ్వక పోవడంతో ఆలస్యం అవుతుందని చెప్పిన వినకుండా గెల్లు రాజశేఖర్ ను ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్లతో తన్నారని అడ్డువచ్చిన గౌడ శ్రీనివాసులు కొట్టడంతో రక్తస్రావం అయి తీవ్ర గాయాలు అయ్యాయని గెల్లు రాజశేఖర్ శనివారం రాత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సిఐ రామకృష్ణ తెలిపారు.