నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా అయిపోయిందని చేతులెత్తేశారు. మారుమూల గ్రామాల నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన తమను పోలీసులు బెదిరిస్తున్నారని, తాము మావోయిస్టులమా అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని సకాలంలో అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు చిన్నాభిన్నమయ్యాయని వాపోయారు.