నందిగామ అసెంబ్లీ నామినేషన్ల లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది..ఇండిపెండెంట్ అభ్యర్థినిగా తంగిరాల సౌమ్య నామినేషన్ ను గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు దాఖలు చేశారు.. బుధవారం టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే... అయితే నామినేషన్ల చివరి రోజు స్వతంత్ర్య అభ్యర్ధి గా మరో మహిళ అదే పేరుతో నామినేషన్ వేయడంతో స్థానిక టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.... నువ్వా నేనా అంటూ వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్దులు కలబడుతున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పేరుతో స్వతంత్ర్య మహిళ నామినేషన్ దాఖలు చేయడం టీడీపీ కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది