మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల విద్యుత్ అధికారి డి. సురేష్ ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలోని మైలారం తండాలో ఆదివారం సాయంత్రం 5:00 లకు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయ పొలాల్లో స్టార్టర్లు, మోటార్లకు ఎర్తింగ్ చేసుకోవాలని, అలాగే ఇళ్లలో కూడా ఎర్తింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతులు వర్ష కాలంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు