వరంగల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం నతనడకన సాగుతున్న జిల్లా కలెక్టర్ సముదాయ పనులను వేగవంతం చేసి త్వరితగతన ప్రారంభించాలని ఎన్సిపిఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ గురువారం మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా ప్రతినిధి బృందం ఆజాం జాహి మిల్ గ్రౌండ్లో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాల విభజన జరిగినా అనేక సంవత్సరాలు గడుస్తున్న వరంగల్ జిల్లా ప్రజలకు జిల్లా కార్యాలయాలు సొంత జిల్లాలో లేకపోవడం ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు.