రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయగా.. జిల్లాలోని సెర్ప్ సిబ్బంది లో ఎల్ 2, ఎల్ 1, ఎంఎస్ సీసీఎస్ 115 మంది ఉద్యోగులకు శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ కౌన్సిలింగ్ నిర్వహించి, బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సెర్ప్ సిబ్బంది జిల్లాలో విధులు సక్రమంగా నిర్వహించాలని, మహిళా సంఘాలను బలోపేతం చెయ్యడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం లో దాదాపు అన్ని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జ