కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ తనిఖీల లో పెండింగ్ లో ఉన్న ఈ చలానాలు కట్టించుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను పట్టుకొని జరిమానా విధించారు. పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ సిఐ కరీం ఉల్లా ఖాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్ ప్రజలందరూ పాటించాలని, తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు. వాహనం పాటు అన్ని ధ్రువపత్రాలు ఉండాలని, పెండింగ్ చలానాలు ఉండకూడదని తెలిపారు.