రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై తీసు కున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ భీంపూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలోనే రెండు లక్షల రుణమాఫీ కార్యరూపం దాలుస్తుండడం అన్నదాత ముఖాల్లో ఆనందం నింపుతోందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందన్నారు.