సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బుధవారం తెల్లవారుజామున గడ్డపోతారం మున్సిపాలిటీలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల ప్రభావంతో వావిలాల గ్రామంలోని పీర్ష చెరువు మత్తడి దూకింది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఇప్పటికే చెరువు అలుగు పారింది. ఇక మరోసారి కురిసిన వర్షాలతో చెరువు పొంగిపొర్లడంతో స్థానిక రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని, వర్షపాతం సమయానికి కురవడంతో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి.