కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ తనయుడు మహమ్మద్ ఇలియాజ్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని నిర్వాహకులు డాక్టర్ బాలు,గంప ప్రసాద్ లు తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను హెల్మెట్ ను అందజేయడం జరిగింది. యువత ముందుకు వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.