పలమనేరు :పలమనేరు మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఏనుగును గమనించిన వాకర్స్ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందజేశారు. అక్కడనుండి ప్రశాంత్ నగర్ లోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి ట్రాకర్స్ సహాయంతో అటవీశాఖ అధికారులు మళ్లించే ప్రయత్నం చేశారు. జనావాసాల్లోకి గజరాజు వచ్చేయడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏనుగుని చూసేందుకు ప్రజలు రోడ్డుపైకి రావడంతో ఏనుగును అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు.