నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఎర్రబెల్లి గ్రామంలో సైదిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ MPTC మేకల శ్రీనివాస్ రెడ్డి ఓ భూమి వాదంలో తనను వేధిస్తుండడంతో అతనికి నిడమనూరు ఎస్సై సురేష్ సహకరిస్తున్నాడని, తన ఫోన్ కూడా లాక్కొని స్విచ్ ఆఫ్ చేశాడని బాధిత రైతు సైదిరెడ్డి ఆరోపించాడు. ఎస్సై సురేష్ వేధింపుల కారణంగానే సైదిరెడ్డి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని సైదిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సైదిరెడ్డిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.