పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో విశాల సహకార సొసైటీ బ్యాంక్ నందు ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఎరువులను ఉపయోగించాలని అన్నారు అధికంగా వాడుట వలన ఏటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు.