కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబం పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం నరసాపూర్ పట్టణంలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని బిజెపి నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిజెపి నాయకులు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.