ధర్మవరం పట్టణంలో ఆదివారం భారీగా వినాయకులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. పట్టణంలోని యశోద స్కూల్ ఎదురుగా ఉన్న చెరువు వద్ద భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. యువత మహిళలు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎటువంటి అపసృతులు చోటు చేసుకోకుండా వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.