మనోపాడు మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్యాసింజర్ లో నుంచి కాలు జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తి జీవరాజుగా స్థానికలు గుర్తించారు. వ్యక్తిని చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.