శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సూగూరులో నరసింహమూర్తి అనే 45 సంవత్సరాల యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతికి గల కారణాలు తెలుస్తాయని సీఐ అబ్దుల్ కరీం తెలిపారు