ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు 15 రోజుల్లో న్యాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనంగా ఉండటం సరికాదని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లకు నెలకు 10000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 2న నిరసన చేపడతామన్నారు.