ఆదిలాబాద్ పట్టణంలో ఓ యువకుని దారుణ హత్య ఘటన కలకలం రేపింది. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని ఇందిరా నగర్ వద్ద రవితేజ (26) అనే యువకున్ని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్య కేసు ను జిల్లా పోలీసులు ఆరు గంటల్లోనే చేదించడం విశేషం... మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు గోవింద్ కార్తిక్, ప్రణీత్, సాయి కిరణ్ లు జల్సా లకు అలవాటుపడి అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ఒక గ్యాంగ్ గా ఏర్పడి డ్రైవర్ గా పని చేస్తున్న రవితేజ ను హత్య చేశారన్నారు.