వరి కోత యంత్రం బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలు అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలం, గోళ్ళతోపు వద్ద తమిళనాడు నుంచి మొలకలచెరువుకు వస్తున్న వరి కోత యంత్రం పెద్ద వీల్ కట్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తమిళనాడు రాష్ట్రం సేలం కు చెందిన వరి కోత యంత్రం డ్రైవర్ జయరాజ్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుణ్ణి స్థానికులు వెంటనే 108 లో చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు.