This browser does not support the video element.
తుంగతుర్తి: తుంగతుర్తిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన తహశీల్దార్ దయానందం
Thungathurthi, Suryapet | Sep 2, 2025
తుంగతుర్తిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను మంగళవారం తహశీల్దార్ దయానందం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులు సరిపోను మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని పరిశీలించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థినులకు మెనూ ప్రకారంగా భోజనం అందించాలన్నారు. వంట, కూరగాయల గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మరుగుదొడ్ల సమస్యను పరిష్కరిస్తానన్నారు.