పెద్దపంజాణి: మండల స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. బసవరాజు కండ్రిక వద్ద తమిళనాడు నుంచి కోళ్ల లోడ్ తో వెళ్తున్న టెంపో ఢీకొని శేఖర్ అనే రైతుకు చెందిన ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఒకటిన్నర లక్ష దాకా నష్టం వాటిల్లిందన్నారు. ఘటన ప్రాంతంలో ఆవు యజమాని టెంపో డ్రైవర్ వాగ్వాదానికి దిగారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.