అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం వద్ద వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి శ్రీ వినాయక మహిళా కోలాట బృందం సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం వద్ద బుజ్జి బుజ్జి గణపయ్య శరణం గణేషా, రఘుకుల తిలక రారా తదితర పాటలకు కోలాటం నృత్యాలు ఆకట్టుకుని కనువిందు చేసాయి. భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాట నృత్యాలను తిలకించారు.