న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఎంవిపి కాలనీ గిరిజన భవన్ లో బుధవారం జస్టిస్ సుగాలి ప్రతి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ న్యాయమూర్తి జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరము సొగాళి ప్రతి మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం చేశారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దగాపడ్డ గిరిజన బిడ్డ సుగాలి ప్రతి మరణానికి కారణమైన దోసు దోషులకు మరణశిక్ష విధించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత బహుజన ఆదివాసి బిడ్డలు కదిలి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు