యూరియా కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గుత్తి రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ, రైతు సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, రైతు సంఘం నియోజవర్గం అధ్యక్షులు వెంకటరాముడు మాట్లాడారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు. రైతులు యూరియా కొరకు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. రైతులు యూరియా కొరకు రోజులు తరబడి ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.