మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ సందీప్ సింగ్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు అధికారులు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు అనంతరం స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది స్టేషన్స్ సిబ్బంది పనితీరుతో పాటు పోలీస్ స్టేషన్లో అత్యధికంగా నమోదైన కేసులు స్టేషన్ పరిధిలోని కాలనీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.