రైతులకు యూరియా సరఫరా కావడం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు.పది సంవత్సరాలు మంత్రిగా జగదీష్ రెడ్డి పనిచేసారని యూరియా ఎవరిస్తారో అని కూడా తెలవకుండా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని విమర్శించారు..యూరియా పై దమ్ముంటే ఢిల్లీకి పోయి నిరసన తెలియజేయలని మండిపడ్డారు.రైతులందరికీ యూరియా అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుందనీ ఆయన అన్నారు