అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 13 మంది అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 4,86,187 విలువైన చెక్కులను ఆదివారం చీడికాడలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంపిణీ చేశారు. మాడుగుల మండలంలో ముగ్గురికి రూ. 2,48,145, చీడికాడలో ఐదుగురికి రూ. 1,25,800, దేవరపల్లిలో నలుగురికి రూ. 1,53,402, కోటపాడులో ముగ్గురికి రూ. 2,48,145 చొప్పున చెక్కులు అందజేశారు.