జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలో,ఓ ఫంక్షన్ హాల్ లో గణేష్ నవరాత్రుల నేపథ్యంలో మండప నిర్వహకులతో సోమవారం 4:30 PM కి CI నీలం రవి SI నరేష్ కుమార్ ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా CI,SI మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా ఎలాంటి అల్లర్లు లేకుండా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు, ప్రజల భద్రతకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని ఏవేని అనుకోని సంఘటనలు ఎదురైతే ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు,గణేష్ మండప నిర్వాహకులు కచ్చితంగా పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన ఉత్తర్వులను నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,