కరీంనగర్ నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ముందు ఒ కారు రాత్రి సమయంలో డివైడర్ కు ఢీ కొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లినట్లు శనివారం స్థానికులు తెలిపారు. విద్యానగర్ నుంచి యూనివర్సిటీ రోడ్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.